మెగాస్టార్ తో ఆటోజానీ సినిమా క్యాన్సిల్ అయిన దగ్గర నుండి పూరిజగన్నాథ్ మెగా కాంపౌండ్ కి దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఒకానొక సంధర్భంలో పూరీ, చిరంజీవి గారు కథ నచ్చలేదని డైరెక్ట్ గా నాతో డిస్కస్ చేస్తే బావుండేది పత్రికా ముఖంగా వెల్లడించడం ఎందుకని అన్నాడు పూరీ. ఇప్పుడు మెగా హీరో సినిమాకు పోటీగా బాలయ్య సినిమాను
రంగంలోకి దింపనున్నాడు. సినిమా అతి తక్కువ రోజుల్లో తెరకెక్కించడం పూరీకే సాధ్యం.
బాలయ్యతో సినిమాను మొదలుపెట్టిన రోజే దసరాకు విడుదల చేస్తానని చెప్పేశాడు. పూరీ ఇలా చెప్పడం కొందరు మెగాభిమానులకు మింగుడు పడడం లేదు. నిజానికి చరణ్-సుకుమార్ ల సినిమాను దసరా విడుదల చేయాలని అనుకున్నారు. ఇలాంటి సమయంలో పూరీ మెగాహీరో సినిమాకు పోటీగా బాలయ్య సినిమాను రంగంలోకి దింపడం కొందరికి రుచించడం లేదు. కావాలనే పూరీ ఇలా తన కోపాన్ని చూపించడానికి రెడీ అవుతున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి!