HomeTelugu Trendingచిరంజీవిపై కన్నేసిన పూరీ!

చిరంజీవిపై కన్నేసిన పూరీ!

3 2
టాలీవుడ్‌ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరెక్షన్‌లో ‘ఆచార్య’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమా తరువాత చిరంజీవి ఏ దర్శకుడితో సెట్స్ పైకి వెళతారా? అనేది ఆసక్తికరంగా మారింది. అన్నీ కుదిరితే పూరి జగన్నాథ్‌తో కలిసి ఆయన సెట్స్ పైకి వెళ్లొచ్చుననే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది.

చిరంజీవి 150వ సినిమానే పూరి చేయవలసింది. అయితే కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు ఎందుకో సెట్ కాలేదు. ఎప్పటికైనా చిరంజీవితో ఓ సినిమా తప్పకుండా చేస్తానని అప్పట్లోనే పూరి చెప్పాడు. ఆ విషయాన్ని మనసులోనే పెట్టుకుని ఆయన ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్ పై కొంతకాలంగా కసరత్తు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. తాను ఒక పెద్ద హీరోకి సంబంధించిన కథపై వున్నానని తాజాగా పూరి జగన్నాథ్ ఇంటర్వ్యూలో చెప్పడంతో, ఆ హీరో చిరంజీవినే అని అంతా అనుకుంటున్నారు. మరి ఈ కాంబినేషన్‌ ఎలా ఉంటుందో చూడాలి!

Recent Articles English

Gallery

Recent Articles Telugu