టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న సాయికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ లోని దుర్గం చెరువులోకి దూకి బలవన్మరణం పొందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పూరీ జగన్నాథ్ వద్ద సాయికుమార్ పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసినట్టు తెలుస్తోంది. అప్పుల బాధను తట్టుకోలేకే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు చెపుతున్నారు. సాయికుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.