జబర్దస్త్ హాస్యనటుడు పంచ్ ప్రసాద్ కొన్నేళ్లుగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. డయాలసిస్ చేయించుకుంటున్నాడు. రెగ్యులర్ గా డయాలసిస్ చేయించుకుంటున్నప్పటికీ ఆరోగ్యంలో ఎలాంటి పురోగతి లేదు. ప్రస్తుతం పంచ్ ప్రసాద్ పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు మరో జబర్దస్త్ కమెడియన్ నూకరాజు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. అతనికి వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలని, అందుకు పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుందని వెల్లడించాడు. ఇందుకు దాతల సాయం కోరాడు.
పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ యూట్యూబ్ లో ఓ వీడియో విడుదల చేశాడు నూకరాజు. ఎన్నో ఆసుపత్రులు తిరిగామని, ఆరోగ్యంలో ఎలాంటి పురోగతి లేదని, మూడేళ్ల క్రితం రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని, అప్పటి నుండి ఇబ్బంది ఎదుర్కొంటున్నాడని తెలిపాడు. పరిస్థితులో మార్పు లేకపోవడంతో అతనికి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని డాక్టర్లు చెబుతున్నారని, దీనికి లక్షల్లో ఖర్చవుతుందని చెప్పారు. దయచేసి తోచినంత సాయం చేయాలని చేతులెత్తి వేడుకుంటున్నానని నూకరాజు అభ్యర్థించాడు.
అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ టీజర్
సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్: భయం కలిగించే చాలా సన్నివేశాలు
బట్టలు లేకుండా హట్ లుక్లో విద్యాబాలన్
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు