తెలుగులో బిగ్‌బాస్ షోతో గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ పునర్నవి భూపాలం. అంతకుముందే కొన్ని సినిమాలు నటించినప్పటికీ అంతగా వర్కవుట్ కాలేదు. ఈమెకు క్రేజ్ కూడా రాలేదు. కానీ బిగ్ బాస్ మూడో సీజన్ వెళ్లొచ్చిన తర్వాత అమ్మడు ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. దానికి తోడు రాహుల్ సిప్లిగంజ్‌తో పునర్నవి భూపాలం చేసిన రొమాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. బిగ్‌బాస్ ఎపిసోడ్స్ నడుస్తున్నన్ని రోజులు కంటస్టెంట్స్ రాహుల్‌సిప్లిగంజ్, పునర్నవి సెంటర్ ఆఫ్ ఎక్స్‌టాక్షన్‌గా నిలిచారు. ఇద్దరూ కెమెరా కంటికి చిక్కిన ప్రతీసారి ఇద్దరు ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చాయి. కెమిస్ట్రీ వర్కవుట్ అవడంతో ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ పుకార్లు చక్కర్లు కొట్టాయి. తాజాగా ఈ వార్తలపై పునర్నవి నోరు విప్పింది. రాహుల్, తాను మంచి స్నేహితులమని, ఇద్దరి స్నేహం తప్ప మరొకటి ఏమీ లేదని స్పష్టం చేసింది. ఇటీవలే పునర్నవిపై ఓ పబ్‌లో కామెంట్లు చేసిన వారిపై రాహుల్ సిప్లిగంజ్ దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారన్న విషయాన్ని కొట్టిపారేసింది. తాను ఒత్తిడిలో ఉన్నట్లు చెప్పిన పునర్నవి.. ఇప్పుడిప్పుడే అందులో నుంచి బయటపడుతున్నట్లు ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వెల్లడించింది.