HomeTelugu Trendingబిగ్‌బాస్ హౌస్‌లో ఓపెన్ అయిన ప్రేమ పక్షులు..!

బిగ్‌బాస్ హౌస్‌లో ఓపెన్ అయిన ప్రేమ పక్షులు..!

2 6బిగ్‌బాస్ హౌస్‌లో ప్రేమ పక్షులు రాహుల్ పునర్నవి ఇద్దరూ తమ రిలేషన్ షిప్ పై ఓపెన్ అయ్యారు. శుక్రవారం ఎపిసోడ్‌లో ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వచ్చిన హౌస్ మేట్స్ కు ఇష్టమైన ఫుడ్, అలాగే మెసేజెస్ పంపడంతో హౌస్ మొత్తం భావోద్వేగాలతో నిండిపోయింది. అయితే ఈ ఎపిసోడ్ లో పునర్నవి, రాహుల్ ఇద్దరూ తమ రిలేషన్ గురించి హౌస్ మేట్స్ తో వేర్వేరుగా పంచుకున్నారు. ఇందులో రాహుల్ అయితే పునర్నవితో తనకు మంచి రిలేషన్ ఉందని తాను చెప్పాలి అనుకుంటే డైరక్టుగా చెప్పేస్తా అని అయితే అది ప్రేమ అనుకోవద్దని వితికతో తన ఫీలింగ్స్ షేర్ చేసుకున్నాడు.

పునర్నవి కూడా రాహుల్ అంటే ఇష్టమే కానీ ప్రేమ లేదని ఇంచుమించు అలాంటి మాటలే అనడం విశేషం. కాగా బిగ్ బాస్ మొదలైనప్పటి నుంచి రాహుల్, పునర్నవి మధ్య ప్రేమాయణం నడుస్తోందని పుకార్లు షికార్లు చేశాయి. అందుకు తగ్గట్టే ఇద్దరి బిహేవియర్ కూడా ఉండటం విశేషం. అయితే ముందు ముందు ఏం జరుగుతుందో…ఇద్దరి రిలేషన్ ఏ తీరాలకు చేరుతుందో అనే ఉత్సుకత మాత్రం ప్రేక్షకుల్లో మిగిలి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu