టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజా హెగ్డేకు ఓ అరుదైన గౌరవం దక్కింది. కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు భారత ప్రతినిధిగా ఆమె హాజరు అయేందుకు ఆహ్వానం అందుకుంది. ఈ ఏడాది కేన్స్ ఫిలిం ఫెస్టివల్ వేడుకలు ఈ నెల 17 నుంచి 28 వరకు కొనసాగనున్నాయి. ఈ వేడుకల్లో భారత ప్రతినిధిగా పూజా హెగ్డే హాజరుకానున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పూజా వెల్లడించింది. దక్షిణాది చిత్రాల్లో సత్తా చాటుతున్న బుట్టబొమ్మ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ వేడుకలకు తొలిసారి హాజరు కానుంది. దేశం తరపున ప్రానిధ్యం వహించే అవకాశం మన స్టార్ నటుల్లో చాలా తక్కువ మందికి లభించింది.
భారత దేశ ప్రతినిధిగా కేన్స్ వేడుకల్లో బుట్టబొమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ అవకాశం రావడంతో పూజా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తోంది. కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొనడమే కాకుండ భారత దేశ చిత్ర పరిశ్రమ, భారతీయ సినిమాల గురించి గొప్పగా చెప్పాలి. ప్రస్తుతం రిహార్స్‌ల్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే బుట్టబొమ్మకు అభిమానులు విషెష్ చెబుతున్నారు.
Always an honour to represent India ❤️ #onwardsandupwards #Cannes2022 pic.twitter.com/BIxCRrd2mh
— Pooja Hegde (@hegdepooja) May 11, 2022