HomeTelugu Trendingజార్జియాలో షూటింగ్‌కు వెళ్లిన పూజాకు కరోనా టెన్షన్

జార్జియాలో షూటింగ్‌కు వెళ్లిన పూజాకు కరోనా టెన్షన్

7 12
ముకుంద సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ముద్దుగుమ్మ పూజా హెగ్డే. మొదట్లో ఈ అమ్మడికి ఆఫర్లు సరిగా లేకపోయినా ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా నిలిచింది. స్థానాన్ని అందుకుంది. ఇక “అల వైకుంఠపురంలో” సినిమా సక్సెస్‌ తరువాత ఈ ముద్దుగుమ్మ మరిన్ని ఆఫర్లు అందుకుంటోంది. టాలీవుడ్‌లోనే కాకుండా ఏకంగా బాలీవుడ్‌ స్టార్‌ హీరో పక్కన ఛాన్స్‌ కొట్టేసింది. బాలీవుడ్ దర్శకుడు ఫర్హాదా సంజీ తెరెకెక్కిస్తున్న “కభి ఈద్ కభి దివాళి” చిత్రంలో సల్మాన్‌ఖాన్‌తో హీరోయిన్‌గా నటించేందుకు పూజాను తీసుకున్నట్టు సమాచారం.

ప్రస్తుతం ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న ఓ రొమాంటిక్‌ లవ్‌స్టోరీ “జాన్‌”లో పూజాహెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జార్జియాలో జరుగుతోంది. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా విదేశీ పర్యటనలంటే భయపడిపోతున్నారు. కానీ పూజా మాత్రం ఓ పక్క కరోనాతో భయపడుతూనే తప్పనిసరి అంటూ షూటింగ్‌లో పాల్గొనేందుకు జార్జియా బయల్దేరింది. ముఖానికి మాస్క్‌ ధరించి చేతులకు గ్లౌస్ ధరించి ఉన్న ఓ ఫోటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఇప్పటికే ప్రభాస్ మరియు కొంతమంది ముఖ్యమైన నటులతో జార్జియాలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu