కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజా రవాణా ఎక్కడికక్కడే ఆగిపోయింది. తిరిగి ప్రజా రవాణా ఎప్పుడు ప్రారంభిస్తారా అని ఆశగా ఎదురు చూస్తున్న కోట్లాది ప్రజలకు కేంద్ర రవాణాశాఖా మంత్రి నితిన్ గడ్కరీ శుభవార్త చెప్పారు. ప్రజా రావాణాకు సంభందించిన కీలక మార్గదర్శకాలను రూపొందిస్తున్నామని తెలిపారు. కొద్ది రోజుల్లోనే వివరాలు వెల్లడిస్తామన్నారు. దేశవ్యాప్తంగా బస్సు, కార్ల ఆపరేటర్లతో గడ్కరీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజారవాణాకు కేంద్ర ప్రభుత్వం అనుమతించినా భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, శానిటైజర్స్ వాడటం తప్పనిసరి అని తెలిపారు.