ప్యాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న సైన్స్ ఫిక్షన్ సినిమా ‘ప్రాజెక్ట్ కె’. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, కమల హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కూడా నటిస్తుండడంతో ఈ సినిమా కోసం భారత సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్నారు. శాన్ డియాగో కామిక్-కాన్ 2023లో లాంచ్ అవుతున్న మొట్టమొదటి భారతీయ చిత్రం ఇదే కావడం మరో విశేషం. ఈ సినిమా నుంచి తాజా అప్డేట్ ఒకటి వచ్చింది.
ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ కె టైటిల్, గ్లింప్స్ విడుదల తేదీ ఖరారైంది. అమెరికాలో ఈ నెల 20న, ఇండియాలో 21న టైటిల్, గ్లింప్స్ విడుదల కానున్నాయి. 20న శాన్ డియాగో కామిక్ కాన్‌లో జరిగే ఈ వేడుకకు ప్రభాస్, కమలహాసన్, దీపికా పదుకొణే, నాగ్ అశ్విన్, చిత్ర నిర్మాతలు హాజరుకానున్నారు. భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ స్థాయిలో నిర్మితం అవుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.