
Yash Kiara Advani fight:
‘KGF’ స్టార్ Yash Kiara Advani జంటగా నటిస్తున్న ‘Toxic’ సినిమా అనుకున్న సమయానికి రాలేకపోతోంది. 2025 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా ఇప్పుడు క్రిస్మస్ 2025కి వెళ్లిపోయింది. కారణం? కియారా అద్వానీ పెర్ఫార్మెన్స్‌పై యష్ అసంతృప్తిగా ఉండటమే.
బజ్ ప్రకారం, ముంబైలో తీసిన సన్నివేశాలు యష్‌కు నచ్చలేదు. అందుకే డైరెక్టర్ గీతు మోహందాస్‌తో Rs. 30 కోట్లు ఖర్చుపెట్టిన షూట్‌ను స్క్రాప్ చేయించారని టాక్. ఇప్పుడు మేకర్స్ కొత్త హీరోయిన్ గురించి ఆలోచిస్తున్నారు. నయనతార పేరు వినిపిస్తోంది.
కియారాను రీప్లేస్ చేస్తే మళ్లీ షూట్ చేయాలి. ఇది ఖర్చు, టైమ్ రెండింటినీ పెంచుతుంది. యష్ ‘KGF 2’ తర్వాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు ఎంచుకుంటున్నారు. ‘Liar’s Dice’ ఫేమ్ గీతు మోహందాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఓ రకంగా మేకర్స్‌కి పెద్ద పరీక్షగా మారింది.
నయనతార ఈ సినిమాలో జాయిన్ అయితే, యష్‌తో కలిసి మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. ఇది ఖచ్చితంగా ఫ్యాన్స్‌కి ఓ స్పెషల్ ట్రీట్ అవుతుంది. కానీ ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.