ప్రముఖ మలయాళ సినీ నిర్మాత, ఏఐసీసీ సభ్యుడు, వ్యాపారవేత్త పీవీ గంగాధరన్ కన్నుమూశారు. ఆయనకు 80 సంవత్సరాలు. వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం 6:30 గంటలకు కేరళలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఇక నిర్మాత పీవీ మృతితో మలయాళ సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.
గంగాధరన్ కేరళ సినీ ఇండస్ట్రీలో గృహలక్ష్మి ప్రొడక్షన్స్ స్థాపించి ఆయన పలు సినిమాలు తీశారు. ఇక పీవీ గంగాధరన్ నిర్మించిన కనక్కినవు (1997) చిత్రం బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటెగ్రేషన్ విభాగంలో నర్గీస్ దత్ నేషనల్ అవార్డును గెలుచుకుంది. 2000 జాతీయ చలనచిత్ర అవార్డులలో శాంతం (2001) సినిమా ఉత్తమ చలన చిత్రంగా ఎంపికైంది. ఇక ఇవే ఆయన పలు సినిమాలు రాష్ట్రస్థాయి అవార్డులను గెలుచుకున్నాయి.