ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ దిల్రాజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇక నుంచి సమాజానికి తనవంతుగా ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. మీడియా సమావేశంలో దిల్ రాజు మాట్లాడుతూ.. సోషల్ సర్వీస్ లో ఎవరైనా ఆసక్తి ఉన్నవాళ్లు నాతో కలిసి వస్తే ఇంకా బాగుంటుంది. మంచి పని చేయాలంటే మీడియా సహకారం అవసరం. మా దృష్టికి వచ్చే సమస్యల కన్నా మీ దగ్గరకు సామాజిక సమస్యలు చాలా వస్తాయి. మా దగ్గరకు వచ్చే వాళ్లు అవసరాల కోసం వస్తారు.
ఎక్కడైతే నిజంగా సమస్య ఉందో అక్కడికి మనం చేరుకోవాలి. మీ దగ్గరికి వచ్చే సమస్యలను మా దృష్టికి తీసుకురావాలని మీడియా స్నేహితులను కోరుతున్నా. సామాజిక సేవ చేయాలనుకున్న మీడియా మిత్రులు మాతో జాయిన్ అయితే కూడా బాగుంటుంది. నేను ప్రధానంగా విద్య, ఆరోగ్యం..ఈ రెండింటి విషయంలో సేవలు కొనసాగించాలనుకుంటున్నా. ఆరోగ్యం బాగలేకపోయినపుడు ఆర్థికంగా కష్టాల్లో ఉన్నా లేదంటే చదువుకోవాలని ఉన్నా స్థోమత లేని వారికి అండగా నిలబడతామని పేర్కొన్నారు. దిల్ రాజు నిర్ణయంపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
Vidya, Aarogyam ee rendinti ki pradhaanyatha idthoo prajaa seva cheyaalannade ee Birthday ki theesukunna nirnayam…..DIL RAJU #HappyBirthdayDilRaju @SVC_official pic.twitter.com/IezjtoIhgl
— BARaju (@baraju_SuperHit) December 17, 2020