ఆగస్టు 1 నుంచి టాలీవుడ్లో షూటింగ్‌లు నిలిపివేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై నిర్మాత దిల్‌రాజు ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. సినిమా నిర్మాణ వ్యయం రోజు రోజుకూ పెరిగిపోతుండటంపై నిర్మాతలు అందరం కూర్చొని చర్చించామని దిల్‌రాజు వెల్లడించారు. ప్రేక్షకుడికి అందుబాటులో ఉండేలా టిక్కెట్ల ధరలు ఉండాలని, మంచి కంటెంట్‌తో ప్రేక్షకుడిని మెప్పించేలా సినిమాలు తీయాలని సమావేశంలో చర్చించామన్నారు. ఓటీటీలో సినిమా విడుదల ఎన్ని వారాలకు చేయాలనేదానిపైనా చర్చించినట్లు తెలిపారు. చర్చలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయని, షూటింగ్‌లు నిలిపేసేలా ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు.