Homeతెలుగు Newsయూపీ రాజకీయాల్లో యువ నేతలు

యూపీ రాజకీయాల్లో యువ నేతలు

11 14
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన కోసం బుధవారం అమేథీ చేరుకున్నారు. ప్రియాంక గాంధీ, జ్యోతిరాదిత్య సింధియా యూపీ యువత కలలను నెరవేరుస్తారని రాహుల్ గాంధీ అన్నారు. ప్రియాంక గాంధీ ప్రవేశంతో ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ ఆలోచనా విధానం వస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రియాంక, జ్యోతిరాదిత్య వంటి యువ నేతల ద్వారా యూపీ రాజకీయాలకు సరికొత్త దిశ లభిస్తుందని ఆయన తెలిపారు. వారిద్దరినీ రెండు నెలల కోసం పంపడం లేదని, పార్టీ నిజమైన ఆలోచనా విధానమైన నిరుపేదలు, బలహీన వర్గాల వెన్నంటి ఉండటాన్ని ముందుకు తీసుకెళ్లే మిషన్ అప్పజెప్పినట్టు చెప్పారు. వాళ్లిద్దరూ బాగా పనిచేస్తారనే విశ్వాసం వ్యక్తం చేశారు. “ఇక్కడి యువత కోరుకునేవి కాంగ్రెస్ ఇస్తుంది. మేం ప్రజల కోసం రాజకీయం చేస్తాం. మా ఈ నిర్ణయంతో యూపీలో కొత్త తరహా రాజకీయం వస్తుందని” అన్నారు.

ప్రియాంక గాంధీ వాద్రాను కాంగ్రెస్ పార్టీలో జనరల్ సెక్రటరీగా నియమించారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ప్రియాంకకు తూర్పు ఉత్తర ప్రదేశ్ లో పార్టీని గెలిపించే బాధ్యతను అప్పగించారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ యువ నేత జ్యోతిరాదిత్య సింధియాను పశ్చిమ ఉత్తరప్రదేశ్ లోక్ సభ ఎన్నికల ఇంచార్జిగా నియమించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu