ఒక వైపున బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే మరో పక్క హాలీవుడ్ లో అమెరికన్ టీవీ సిరీస్ ‘క్వాంటికో’తో బిజీబిజీగా గడుపుతోంది ప్రియాంక చోప్రా. అయితే ఇప్పుడు ఆమెను వెతుక్కుంటూ ఓ హాలీవుడ్ సినిమా ఛాన్స్ వచ్చిందనే మాటలు జోరుగా వినిపిస్తున్నాయి.
టామ్ క్రూస్ ప్రధాన పాత్రలో ‘మిషన్ ఇంపాజిబుల్ 6’ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఇండియాలో చిత్రీకరించనున్నారు. అంతేకాదు టామ్ క్రూస్ సరసన ప్రియాంక చోప్రాను తీసుకునే ఆలోచనలో ఉన్నారట.
ప్రస్తుతం ప్రియాంక ఉన్న బిజీ షెడ్యూల్స్ లో డేట్స్ ను అడ్జస్ట్ చేయలేదేమో అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆమె సన్నిహితులు. మరి ప్రియాంక కాల్షీట్స్ కేటాయిస్తుందో.. లేక హాలీవుడ్ ఛాన్స్ వదులుకుంటుందో… చూడాలి!