నూతన సంవత్సర వేడుకను పురస్కరించుకుని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా భర్త నిక్ జొనాస్ ఓ స్పెషల్ కాన్సర్ట్‌ను ఏర్పాటు చేశారు. వేడుకల్లో భాగంగా న్యూ ఇయర్‌కు ఆహ్వానం పలుకుతూ తన సతీమణి ప్రియాంకను స్టేజ్ పైకి తీసుకువచ్చిన నిక్ అనంతరం ఆమెను ప్రేమగా ముద్దాడాడు. న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించిన వీడియో, ఫొటోలను పలువురు అభిమానులు ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. వీరి జంట చూడ ముచ్చటగా ఉందంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు.
మరోవైపు ఈ ఏడాది విడుదలైన ‘ది స్కై ఈజ్ పింక్’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు నటి ప్రియాంక. చిన్నప్పుడే అరుదైన వ్యాధికి గురైనప్పటికీ 15 ఏళ్లకే స్ఫూర్తిదాయక వక్తగా, రచయిత్రిగా గుర్తింపు తెచ్చుకున్న అయిషా చౌదరి జీవితకథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం ఆమె ‘ది వైట్ టైగర్’ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. 2019లో మంచి విజయాలను సొంతం చేసుకున్న ప్రియాంక.. 2020 తనకి ఎలాంటి విశేషాలను అందించబోతోందో అని ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు.