ఇండియా, పాక్ వివాదంతో ప్రియాంక చోప్రా పేరు మారుమ్రోగిపోతున్నది. అక్కడ చూసినా ఆమె పేరు వినిపిస్తున్నది. ఇటీవలే జోనస్ బ్రదర్స్ మ్యూజిక్ ఈవెంట్ లో పాల్గొన్న ప్రియాంక ఆ తరువాత.. హాస్పిటల్లో ఉన్న అభిమానిని కలిసి పలకరించింది. అక్కడి నుంచి భర్త నిక్ తో కలిసి విహార యాత్రకు వెళ్లి న్యూయార్క్ వచ్చింది. న్యూయార్క్ లో రోడ్డుమీద నడుస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యింది.
బ్లాక్ అండ్ వైట్ స్ట్రాప్ డ్రెస్ లో అదరగొట్టింది ప్రియాంక. ఒక పర్ఫెక్ట్ మోడ్రన్ బ్యూటీ ఎలా ఉండాలో అచ్చంగా అలా ఉన్నది. ఎలాంటి దుస్తుల్లో కనిపిస్తే యువత ఎట్రాక్ట్ అవుతారు అలాంటి దుస్తుల్లో మెరవడం ప్రియాంకకు కొత్తేమి కాదు. థై ఫిట్ తో మెరుపులు మెరిపించి ప్రియాంక, తన తల్లి మధు చోప్రాతో కలిసి న్యూయార్క్ వీధుల్లో విహరిస్తోంది. ఎందుకలా అనే సందేహం రావొచ్చు. ఈరోజు యూఎస్ ఓపెన్ 2019 మ్యాచ్ జరుగుతున్నది. ఈ మ్యాచ్ ను చూసేందుకు తల్లి మధు చోప్రాతో కల్సి పీసీ న్యూయార్క్ వెళ్లిందట.