హీరోయిన్ ప్రియాంకా చోప్రా బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కు వెళ్లిన తరువాత తన స్టైల్ ను మార్చేసింది. ఇండియాలో ఉన్నప్పుడు ఇండియన్ ట్రెడిషన్ ను ఫాలో అయినా ప్రియాంక చోప్రా.. హాలీవుడ్ కు వెళ్లిన తరువాత తన ట్రెండ్ ను మార్చేసింది. ఇండియన్ ట్రెడిషన్ కు కొంచెం ఫ్యాషన్ సొగసులు అద్ది.. స్టైలిష్ గా కనిపించింది. లైట్ రోజ్ కలర్ శారీలో అదరహో అనిపించింది.
ఫ్రాన్స్ లో హాలీవుడ్ నటి వివాహానికి ప్రియాంక చోప్రా ఆమె భర్త నిక్ జోనస్ లు హాజరయ్యారు. ఈ వేడుకకు ప్రియాంక చోప్రా లైట్ కలర్ నెట్ శారీతో వావ్ అనిపిస్తే.. నిక్ జోనస్ బ్లాక్ కలర్ సూట్ లో మెరుపులు మెరిపించారు. చాలా రోజుల తరువాత ప్రియాంక చోప్రా ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.