బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా షూటింగ్లో గాయపడిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మొహం మీద మట్టి, నుదురు, చెంపలపై ఉన్న రక్తపు గాయాలకు సంబంధంచిన ఫొటోను ప్రియాంక తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. అయితే షూటింగ్లో హీరోలు గాయపడటం సాధారణ విషయమే. ఫైట్స్, స్టంట్స్ సీన్స్ చేసేటప్పుడు వారు తరచూ ప్రమాదాల బారిన పడుతుంటారు.అయితే హీరోయిన్లు గాయపడటం అనేది చాలా అరుదు. అయితే ప్రియాంకుకు అయిన ఈ గాయాలు తీవ్రంగా ఉండటంతో ఆమె ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. దీంతో ఏమైంది ఇవి నిజంగా జరిగిన ప్రమాదమా లేక షూటింగ్ భాగంగా పెట్టిన గాయలా అని ఆరా తీయం మొదలు పెట్టారు.
ఇక ఫ్యాన్స్ ఆందోళన చూసి ప్రియాంక వారి సందేహాలకు ఇలా బదులిచ్చింది. ఒక ఫొటోలు మొత్తం ఆమె ముఖం మట్టితో కొట్టుకుపోయి ఉండగా… మరోవైపు నుదుటి నుంచి రక్తం చెంపలపైకి జారుతుంది. అలాగే కనుబొమ్మపై కూడా గాటు ఉంది. అవి చూపిస్తూ చెంపలపై ఉంది నిజమైన గాయం కాదని, కనుబొమ్మపై ఉంది నిజమైన గాయం అంటూ తన ఇన్స్టా స్టోరీలో ప్రియాంక వెల్లడించింది. దీంతో ఆమె ఫ్యాన్స్ హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు. కాగా ప్రస్తుతం ప్రియాంక సిటాడెల్ అనే వెబ్ సిరీస్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ షూటింగ్ కోసం ప్రస్తుతం ఆమె లండన్ ఉంది. ఇందులో ప్రియాంక భారీ యాక్షన్ సీన్స్ ఉన్నాయని ఇందులో భాగంగానే ఈ గాయాలు అయినట్లు తెలుస్తోంది.