HomeTelugu Big Storiesఆసుపత్రిలో చేరిన ప్రియాంక చోప్రా భర్త నిక్‌ జోనస్‌

ఆసుపత్రిలో చేరిన ప్రియాంక చోప్రా భర్త నిక్‌ జోనస్‌

Priyanka chopra husband nic
బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా భర్త, ప్రముఖ హాలీవుడ్ గాయకుడు నిక్ జోనస్ ఆసుత్రిలో చేరినట్లు తెలుస్తోంది. లాస్‌ ఏంజెల్స్‌లో శనివారం రియాలిటీ షో ‘ది వాయిస్‌’ షూటింగ్ చేస్తున్న టైమ్‌లో ఆయనకు స్వల్ప గాయాలయినట్లు, దీంతో అతన్ని వెంటనే హాస్పిటల్‌లో జాయిన్ చేసినట్లు సమాచారం. గాయాలు పెద్ద‌వేమి కాక‌పోవ‌డంతో డాక్టర్ల చికిత్స అనంతరం ఆదివారం డిశ్చార్జ్‌ అయినట్లు టాక్‌.

నిక్ యదావిధిగా సోమవారం మాత్రం తన రియాలిటీ షో ‘ది వాయిస్’లో పాల్గొనబోతున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే అతనికి గాయాలు ఎలా అయ్యాయనే విషయం తెలియరాలేదు. ప్రస్తుతం ఎవరి పనులల్లో వారు బీజీగా ఉన్నారు. ప్రియాంక తన ప్రాజెక్ట్స్‌ కోసం లండన్‌, నిక్‌ జోనస్‌ లాస్‌ ఏంజెల్స్‌లో ఉంటున్నాడు. మరోవైపు భారత్‌లో కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో ప్రియాంకా చోప్రా, తనభర్త నిక్‌ జోనాస్‌ కలిసి కోవిడ్‌ బాధితుల కోసం ‘టుగెదర్‌ ఇండియా’ అంటూ విరాళాలు సేకరిస్తున్న సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu