గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఏ పని చేసిన ట్రెండింగ్ అవుతోంది. ఆమె ఏ కార్యక్రమానిక హాజరైన తనదైన స్టయిల్లో వస్త్ర అలంకరణతో వార్తల్లో నిలుస్తుంది. ఏడాది పాటు ప్రేమించి.. అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌ను ప్రియాంక పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రియాంక మరింత పాపులర్ అయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ.. ఇటు హిందీ సినిమాల్లో చేస్తూనే అటూ హాలీవుడ్లో కూడ నటిస్తుంది. అది అలా ఉంటే తాజాగా లాస్ ఏంజెల్స్‌లో జరిగిన 62వ గ్రామీ అవార్డ్ ఫంక్షన్లో భారతీయ అందం ప్రియాంక చోప్రా భర్తతో కలిసి సందడి చేసింది. సిల్వర్ కలర్ డ్రెస్‌లో మొత్తం బెల్లి బటన్ కనబడేట్టు డ్రెస్ వేసికున్న ప్రియాంక బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ లుక్‌తో ఆకర్షిస్తుంది.