నటి ప్రియాంకా చోప్రా, నిక్ జొనాస్ ఇటలీలో విహరిస్తున్నారు. రెండు రోజుల క్రితం అక్కడికి వెళ్లిన వీరు విలువైన సమయాన్ని గడుపుతున్నారు. ఈ సందర్భంగా తీసిన వీడియోలు, ఫొటోలను సోషల్‌మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. శనివారం రాత్రి వంట చేస్తున్న వీడియోలను పోస్ట్ చేసిన నిక్.. తర్వాత భార్యతో ఉన్న వీడియోను పంచుకున్నారు. ఇందులో ప్రియ, నిక్ అందమైన ప్రకృతి మధ్య స్లో డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఈ వీడియో అభిమానుల్ని ఆకట్టుకుంది.