HomeTelugu Trendingఅతిథులకు ప్రియాంక, నిక్‌ పెళ్లి కానుక ఇదే!

అతిథులకు ప్రియాంక, నిక్‌ పెళ్లి కానుక ఇదే!

10 16బాలీవుడ్‌ ప్రముఖ నటి ప్రియాంకా చోప్రా, నిక్‌ జొనాస్‌ల పెళ్లి వేడుక మొదలు కావడానికి కేవలం ఒక్క రోజే ఉంది. రాజస్థాన్‌లోని ఉమైద్‌ భవన్‌ ప్యాలెస్‌ ఈ శుభకార్యానికి వేదికైనట్లు సమాచారం. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు పూర్తయ్యాయట. నిక్‌ తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ముంబయి చేరుకున్నారు. బుధవారం ప్రియాంక నివాసంలో పూజ నిర్వహిస్తోన్నట్లు తెలిసింది. గురువారం ప్యాలెస్‌లో మెహెందీ, సంగీత్‌ వేడుకలు జరగనున్నాయట. శుక్రవారం పార్టీ, శనివారం హల్దీ (పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడికి పసుపు రాసే కార్యక్రమం) వేడుకని నిర్వహించనున్నారట. డిసెంబరు 2, 3న ప్రియాంక, నిక్‌ వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. పెళ్లి వేడుకల కోసం ప్రియాంక ప్యాలెస్‌ను ఐదు రోజులకు బుక్‌ చేసుకున్నట్లు సమాచారం. ఈ ఏర్పాట్లకు రూ. 4 కోట్లు ఖర్చు చేసినట్లు వార్తలు వచ్చాయి.

కాగా కాబోయే వధూవరులు ఇప్పటికే అతిథులకు ఇవ్వాల్సిన కానుకల్ని సిద్ధం చేయించారట. వెండి నాణేలను వీరు బహుమతిగా ఇవ్వనున్నారంటూ సోషల్‌మీడియాలో కొన్ని ఫొటోలు వైరల్‌గా మారాయి. అందులో నాణేనికి ఓ వైపు ‘ఎన్‌పీ’ (నిక్‌, ప్రియాంక) అని రాసి ఉండగా.. మరోవైపు గణేష్‌, లక్ష్మీ దేవిల ప్రతిమలు ఉన్నాయి.

10a 1

Recent Articles English

Gallery

Recent Articles Telugu