అక్కినేని నాగచైతన్య హీరోగా వెంకట్ ప్రభు డైరెక్షన్లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడిగా వెంకట్ ప్రభుకి ఇది 11వ సినిమా కాగా, కెరియర్ పరంగా ఇది చైతూకి 22వ సినిమా. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు ప్రారంభమైంది. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల కోసం ఎంపికైన స్టార్స్ ఒక్కొక్కరుగా రంగంలోకి దిగుతున్నారు.
ఈ సినిమాలో ప్రియమణి, సంపత్ రాజ్ ను కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ.. అందుకు సంబంధించిన పోస్టర్స్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమా షూటింగులో వారు జాయిన్ అవుతున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.