జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో ‘దేవర’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇందులో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తొలిసారి తెలుగులో నటిస్తోంది.
దేవర మూవీలో ఎన్టీఆర్ డబుల్ రోల్ చేస్తున్నాడు. ఇందులో ఓ పాత్రకు ఎన్టీఆర్ భార్యగా ప్రియమణి నటిస్తోందనే వార్త వైరల్ అవుతోంది. కొడుకుగా ఉన్న ఎన్టీఆర్ పాత్రకు ప్రియమణి తల్లిగా నటిస్తోందని టాక్.
తల్లిపాత్రలో నటిస్తోందంటూ ప్రియమణి ఫ్యాన్స్ బాధపడుతున్నారు. ఇంకా ఏమాత్రం గ్లామర్ తగ్గని ప్రియమణి తల్లి పాత్రను పోషించడమేంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రం ‘యమదొంగ’లో ఎన్టీఆర్ సరసన ప్రియమణి నటించిన సంగతి తెలిసిందే.
దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు.