నటుడు ప్రియదర్శి బైక్ చోరీకి గురైంది. ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న బైక్‌ను ఓ వ్యక్తి ముసుగేసుకుని వచ్చి ఎత్తుకెళ్లాడు. ఆ సమయంలో రికార్డైన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇది నిజంగా జరిగిన చోరీ కాదు. హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటించిన ‘నిను వీడని నీడను నేనే’ చిత్రం కోసం చేసిన ప్రమోషనల్ క్యాంపెయిన్.
ఈ సినిమాలో ప్రియదర్శిని కూడా ఎంపికచేసుకోవాలని అనుకున్నారట. కానీ డేట్లు ఖాళీ లేక సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. కనీసం ప్రియదర్శి బైక్‌నైనా సినిమాలో వాడుకుందామని భావించిందట చిత్రబృందం . అందులో భాగంగానే బైక్‌ను చోరీ చేస్తున్నట్లుగా చిత్రించారు. ఈ విషయం ప్రియదర్శికి కూడా తెలీదట. దాంతో ఆయన కూడా కాస్త సీరియస్ అయ్యారు.
విషయం మరింత పెద్దది అవ్వకుండా సందీప్ కిషన్ అసలు విషయాన్ని బయటపెట్టారు. ‘ఈ విషయం మేం అనుకున్నదానికన్నా సీరియస్ అవుతోంది. ఇది ప్రచారం కోసం చేసిన పని. మాకు ప్రియదర్శి డేట్లు దొరకలేదు. దాంతో సినిమాలో ఆయన బైక్‌ను చూపించాలని తీసుకెళ్లాం. నాకు ఈ బైక్ నడపడం చాలా నచ్చింది. లవ్యూ దర్శి బాయ్’ అని ట్వీట్ చేస్తూ బైక్ నడుపుతున్న వీడియోను పోస్ట్ చేశారు.
ఇందుకు ప్రియదర్శి స్పందిస్తూ.. ‘నా బైక్‌కి నీ సినిమా ద్వారా బ్రేక్ ఇచ్చినందుకు థాంక్స్ అన్నా’ అని చెప్పారు. అయితే బైక్ దొంగతనం చేస్తున్నప్పుడు వీడియోను సోనీ కెమెరాతో చిత్రించినట్లు తెలుస్తోందని ప్రియదర్శి చమత్కరించారు.
Sorry this got more serious than we expected..it's a fun promotional campaign that we are doing for #NinuVeedaniNeedaniNene ..
As we dint get @priyadarshi_i dates..we had his bike make a special appearance in our film..
PS: I loved riding it ❤️
Love you Darshi boy 😘😘😘 pic.twitter.com/sx6DbUN4Sh— #NVNN 12th July (@sundeepkishan) July 8, 2019