నటుడు ప్రియదర్శి అంటే ముందుగా గుర్తుకొచ్చేది కామెడీ. పెళ్లి చూపులు చిత్రంతో పాపులర్ అయిన ప్రియదర్శి తన ప్రతీ సినిమాలోనూ అదిరిపోయే కామెడీ చేశాడు. అందుకే నేటి తరం కమెడియన్స్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. కామెడీతో పాటు అన్ని ఎమోషన్స్ పండించడంలో ముందున్నాడు. పెళ్లి చూపులు సినిమాలకు ముందు రెండు మూడు సినిమాల్లో చాలా సీరియస్ కారెక్టర్స్ చేసినప్పటికీ అవి ప్రియదర్శికి అంతగా గుర్తింపు తేలేదు. పెళ్లి చూపులు తర్వాత కమెడియన్‌గా ముద్ర పడిపోయింది. కానీ ఛాన్స్ దొరికిన ప్రతీసారి తాను అది మాత్రమే కాదని నిరూపించుకుంటున్నాడు. మల్లేశం సినిమాలోని పాత్రకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్నాడు. తాజాగా కొత్త తరహా పాత్రతో ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ (ING) అనే వెబ్‌సిరీస్ చేయబోతున్నాడు. క్రైమ్ అండ్ థ్రిల్లర్ కథాంశంతో వస్తున్న ఈ సిరీస్‌లో ప్రియదర్శి మెయిన్ రోల్ చేస్తున్నాడు. మొత్తం 7 ఎపిసోడ్లుగా రూపొందుతున్న ఈ వెబ్‌సిరీస్‌లో ప్రియదర్శికి జంటగా బిగ్‌బాస్ ఫేమ్ నందిని రాయ్ నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ ఆహాలో స్ట్రీమ్ కానుంది. ఈ సిరీస్‌ను సురేష్ కృష్ణ ప్రొడక్షన్స్ ప్రై.లిమిటెడ్ బ్యానర్‌పై సీనియర్ దర్శకుడు సురేష్ కృష్ణ నిర్మిస్తున్నారు.