హీరోయిన్ ప్రియా వారియర్ నటించిన ‘లవర్స్ డే’ పరాజయం తరువాత, మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో బాలీవుడ్ నుంచి శ్రీదేవి బంగ్లా సినిమాలో ఆఫర్ వచ్చింది. ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్నది. ఇది రిలీజ్ కాకముందే, బాలీవుడ్ నుంచి మరో అఫర్ రావడం విశేషం. లవ్ హ్యాకర్స్ పేరుతో తెరకెక్కబోతున్న హిందీ సినిమాలో ప్రియా వారియర్ హీరోయిన్ గా నటించే అవకాశం కలిగింది.
మయాంక్ ప్రకాష్ శ్రీవాస్తవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే నుంచి సెట్స్ మీదకు వెళ్ళబోతున్నది. క్రైమ్ థ్రిల్లర్ జానర్లో సినిమాను తెరకెక్కించబోతున్నారట. మరి ఈ రెండు సినిమాల్లో ఒక్క సినిమానైనా హిట్టయితే… ప్రియా వారియర్ దశతిరిగినట్టే.