ఒక్కసారి కన్ను గీటి అలా కుర్రకారును తనవైపు తిప్పుకున్న మలయాళ నటి ప్రియా ప్రకాశ్ వారియర్. ఆమె నటించిన తొలి సినిమా ‘ఒరు అడార్ లవ్’. ఈ చిత్రంలోని కన్ను గీటి సన్నివేశంతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది. తాజాగా ప్రియ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటోను షేర్ చేశారు. విజయ్ దేవరకొండతో దిగిన ఫొటోను షేర్ చేస్తూ ‘నువ్వంటే నాకు చాలా ఇష్టం’ అని తెలుగులో క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫొటో షేర్ చేసిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విజయ్ దేవరకొండకి మహిళా అభిమానులే కాదు నటీమణులు కూడా ఫిదా అయిపోయారని అనడానికి ఈ ఫొటోనే ఉదాహరణ.
ప్రియా వారియర్ తెలుగులో నితిన్ హీరోగా నటిస్తున్న ‘రంగ్‌దే’ సినిమాలో నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కీర్తి సురేష్ మరో హీరోయిన్‌గా నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. మరోపక్క ప్రియా వారియర్ నటించిన బాలీవుడ్ సినిమా ‘శ్రీదేవి బంగ్లా’ రిలీజ్‌కు రెడీ అవుతుంది.