మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమార్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ఆయన సినిమాలకు ఇక్కడ కూడా మంచి గిరాకీ ఉంది. అయ్యప్పనుమ్ కోషియమ్, జనగణమన, కడువ వంటి సినిమాలతో పృథ్వి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయాడు. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న’సలార్’లోనూ కీలకపాత్ర పోషిస్తుండటంతో ఇక్కడ మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే తాజాగా పృథ్విరాజ్ ప్రమాదానికి గురైయ్యాడు.
ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘విలాయత్ బుద్ద’ షూటింగ్‌లో పృథ్విరాజ్ గాయాలపాలైయ్యాడు. బస్సులో ఓ ఫైట్ సీన్ చేస్తున్న సమయంలో పృథ్వీరాజ్ జారిపడ్డారు. దాంతో ఆయన కాలికి గాయమైంది. గాయం ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఆయన్ని వెంటనే కేరళలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. సోమవారం ఆయనకు సర్జరీ కూడా చేయనున్నారు. దాంతో పృథ్వి కొన్ని రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు జయన్ నంబియార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌లు సినిమాపై మంచి హైప్‌ను క్రియేట్ చేశాడు.
అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ టీజర్
సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్: భయం కలిగించే చాలా సన్నివేశాలు
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు