‘దియా’ ఫేం.. కన్నడ యంగ్ హీరో పృథ్వీ అంబర్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి సుజాత కన్నుమూశారు. కొంతకాలం హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆరోగ్యం బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఆరోగ్యం విషమించడంతో ఆమె తుదిశ్వాస విడిచారు. తల్లి మరణంతో పృథ్వీ ఇంట విషాద చాయలు నెలకొన్నాయి. ఆమె మృతిపట్ల కన్నడ టీవీ, సినీ నటీనటులు సంతాపం తెలుపుతు పృథ్వీ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు.
కాగా పృథ్వీ పలు టీవీ సీరియల్స్‌లో నటించి గుర్తింపు పొందాడు. 2014లో వచ్చిన ‘బరికే’ అనే తుళు సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చాడు పృథ్వీ. 2020లో వచ్చిన ‘దియా’ సినిమాతో హీరో అయ్యారు. ఈ సినిమా తెలుగులోనూ ‘దియా’ పేరుతో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. హీరోగా పృధ్వీ నటనకు మంచి మార్కులు పడ్డాయి.