Siddharth Aditi Rao Hydari Wedding:
సిద్ధార్థ్ , అదితి రావుల ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్త ఎట్టకేలకు నిజమైంది. ఆదితి రావు హైదరి మరియు సిద్ధార్థ్ పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్లుగా తమ వ్యక్తిగత జీవితాన్ని చాలా ప్రైవేటుగా ఉంచుకున్న ఈ జంట, ఇటీవలే వనపర్తి, తెలంగాణలోని ఒక ఆలయంలో సాంప్రదాయ హిందూ వివాహ పద్ధతుల ప్రకారం ఒక్కటయ్యారు.
వీరి పెళ్లి వేడుక సాదాసీదాగా, కానీ ఎంతో అందంగా జరిగింది. పెళ్లి ముగిసిన వెంటనే, ఇన్‌స్టాగ్రామ్‌లో తమ వివాహ ఫోటోలను పంచుకున్న సిద్ధార్థ్ మరియు ఆదితి, అభిమానులకి సర్ప్రైజ్ ఇచ్చారు. వారి పెళ్లి ఫోటోలు క్షణాల్లోనే వైరల్ అవుతూ సోషల్ మీడియా మొత్తం హల్చల్ చేశాయి.
View this post on Instagram
ఆదితి పెళ్లిలో ఒక సాంప్రదాయ గోల్డెన్ ఆర్గాంజా లెహంగా ధరించి, అందమైన రూబీ మరియు గోల్డ్ నగలతో మెరిసిపోతూ కనిపించారు. సాదాసీదా, శాస్త్రోక్తంగా ఎంతో అందంగా కనిపించారు. మరోవైపు, సిద్ధార్థ్ సాంప్రదాయ కుర్తా, వెష్తి ధరించి, స్టైలిష్ గా కనిపించారు.
వీరి పెళ్లిలో అన్నిటికంటే ఒకటి అందరి దృష్టినీ ఆకర్షించింది, అది సిద్ధార్థ్ పెట్టుకున్న విలాసవంతమైన వాచీ. ఆయన ధరించిన ఆడెమార్స్ పిగ్వెట్ రాయల్ ఓక్ వాచీ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వాచీ విలువ అక్షరాలా 27.62 లక్షలు. ఈ లగ్జరియస్ వాచీ, సింపుల్ పెళ్లి లుక్ తో కొత్త ఆకర్షణగా నిలిచింది అని చెప్పుకోవచ్చు.
Read More: Rana తో దుల్కర్ సల్మాన్ కి ఈగో ప్రాబ్లమ్స్?
పెళ్లి సందర్భంగా ఈ జంట తమ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక భావోద్వేగపూరితమైన సందేశం తోపాటు వారి పెళ్లి ఫోటోలు షేర్ చేశారు. అధికారికంగా వీరు మార్చిలోనే తమ ఎంగేజ్మెంట్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. .