Aishwarya Rai Abhishek Bacchan Dubai villa:
బాలీవుడ్‌క లో పవర్ కపుల్ గా నిలిచిన ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ ప్రేమకథ అందరికీ తెలిసిందే. 2007లో వివాహం చేసుకున్న ఈ జంట, వెండితెరపై మాత్రమే కాదు, వారి వ్యక్తిగత జీవితంలోనూ అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. ఇండస్ట్రీలో ఇద్దరు తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుని.. ఆర్థికంగా కూడా చాలా బాగానే స్థిరపడ్డారు.
వీరి లగ్జరీ గురించి చెప్పాలంటే ఈ జంటకు దుబాయ్‌లోని వారి విల్లా గురించి చెప్పాలి. దుబాయ్‌లోని జుమైరా గోల్ఫ్ ఎస్టేట్స్‌లోని సాంక్చువరీ ఫాల్స్ ప్రాంతంలో ఉన్న ఈ విల్లా విలువ సుమారు రూ. 16 కోట్లు. 97 విల్లాల కమ్యూనిటీలో భాగమైన ఈ ఇల్లు, 18-హోల్ చాంపియన్‌షిప్ గోల్ఫ్ కోర్సుకు ఎదురుగా ఉంటుంది. ఈ లగ్జరీ హోమ్ అందమైన ప్రదేశంలో హైఎండ్ ఫీచర్లతో ఉంటుంది.
స్కావోలిని డిజైనర్ కిచెన్, బ్యాంగ్ & ఓల్ఫ్సెన్ హోమ్ థియేటర్, స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ వంటి సౌకర్యాలు ఈ ఇంటిని ప్రత్యేకంగా చేశాయి. ఇంకా, ఈ విల్లాలో ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్, పచ్చని తోటలు కూడా ఉన్నాయి. కుటుంబంతో సమయాన్ని గడిపేందుకు లేదా ప్రశాంతంగా ఉండటానికి ఈ ఇల్లు మంచి వాతావరణాన్ని అందిస్తుంది.
విలాసవంతమైన జీవనశైలితో పాటు ఐశ్వర్య, అభిషేక్ ఇద్దరి కెరీర్లు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఐశ్వర్య రాయ్, రూ. 776 కోట్ల నెట్ వర్త్ తో బాలీవుడ్‌లో ప్రత్యేకస్థానం సంపాదించుకున్నారు. అభిషేక్ తన తాజా సినిమా “I Want to Talk” to మళ్లీ తన ప్రేక్షకులను మెప్పించారు.