దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తీస్తున్న తాజా చిత్రం ‘పెళ్ళిసందD’. ఈ సినిమాలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రం నుంచి తొలి పాట విడుదలైంది. ‘నువ్వంటే నాకు ధైర్యం.. నువ్వంటే నాక సర్వం’ అనే పల్లవితో సాగే ఈ సాటను చంద్రబోస్ రాయగా హరిచరణ్, శ్వేతా పండిట్ ఆలపించారు. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాకు గౌరీ రోనంకి దర్శకత్వం వహించారు. ఆకె. ఆసోసియేట్స్, ఆర్కా మీడియా వర్క్ కలసి నిర్మిస్తున్న ఈ సినిమాకు మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కుతుంది. శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. ఆదిత్య మ్యూజిక్ సంస్థ ఈ పాటను విడుదల చేసింది.