స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ”పుష్ప”. సుకుమార్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రానున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో కనిపించనున్నాడు. తెలుగు తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో ఆగస్టు 13న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఫస్ట్ లుక్ మినహా ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వని మేకర్స్.. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధమైయ్యారు. ఈ క్రమంలో తాజాగా ‘ప్రీ ల్యూడ్ ఆఫ్ పుష్పరాజ్’ పేరుతో ఓ స్మాల్ గ్లిమ్స్ వదిలారు.
ఈ గ్లిమ్స్ విశేషంగా ఆకట్టుకుంటోంది. దీనికి సినిమాటోగ్రాఫర్ మిరోస్లా కుబా బ్రోజెక్ విజువల్స్.. దేవిశ్రీప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయాయి. ఈ సందర్భంగా ఏప్రిల్ 7న సాయంత్రం గం. 6.12 నిమిషాలకు ‘పుష్ప రాజ్’ ను పరిచయం చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. 18 సెకండ్ల ‘ప్రీ ల్యూడ్ ఆఫ్ పుష్పరాజ్’ గ్లిమ్స్ చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.