టాలీవుడ్‌లో యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. ‘అ’ వంటి తక్కువ బడ్జెట్ సినిమాలను మాత్రమే కాదు, ‘కల్కి’ వంటి భారీ బడ్జెట్ సినిమాలను కూడా తెరకెక్కించగలనని ఆయన నిరూపించుకున్నాడు. అంతేకాదు ‘జాంబి రెడ్డి’ వంటి సినిమాలతో హారర్ సినిమాలు కూడా తీయగలనని చాటి చెప్పాడు.
‘జాంబి రెడ్డి’ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా, ప్రశాంత్ వర్మకి మంచి పేరు తెచ్చిపెట్టింది. దాంతో ఆ సినిమాకి సీక్వెల్ చేయడానికి ఆయన రంగంలోకి దిగాడు. ఇప్పటికే స్క్రిప్ట్ ను కూడా సిద్ధం చేసుకున్నాడట. ‘జాంబి రెడ్డి’కి మించి ఈ సీక్వెల్ హారర్‌తో సాగుతుందని అంటున్నాడు. ఈ సీక్వెల్ ను పట్టాలెక్కించే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయనీ, కరోనా ప్రభావం తగ్గగానే షూటింగు మొదలుకావొచ్చని చెబుతున్నాడు. ఇక ఈ సినిమా తరువాత సమంత ప్రధాన పాత్రధారిలో ఒక సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది.