కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన ఆల్టైమ్ ఫేవరెట్ డైరెక్టర్ ‘ఉపేంద్ర’ అని ప్రశాంత్ నీల్ తెలిపారు. ష్!, తర్లే నాన్ మగ, ఓమ్ లాంటి సినిమాలు ప్రపంచంలో ఉపేంద్ర తప్ప మరెవరూ తెరకెక్కించలేరని, అందుకే ఆయనే తనకు ఇష్టమైన డైరెక్టర్ అని ప్రశాంత్ నీల్ చెప్పారు.
‘నా ఫేవరెట్ డైరెక్టర్ ఆల్టైమ్ అంటే ఉపేంద్ర సర్. కన్నడ ప్రోగ్రాం అని నేను ఇలా చెప్పడం లేదు. ప్రపంచంలో ఎవరైనా ష్!, తర్లే నాన్ మగ, ఓమ్ లాంటి చిత్రాలను ఒకరే తెరకెక్కించడం అసాధ్యం. ఆ సినిమాలు ఒకదానితో పోలిస్తే మరొకటి చాలా విభిన్నంగా ఉంటాయి. డిఫరెంట్ జానర్లలో ఉంటాయి. అవి తెరకెక్కించడం చాలా కష్టం. కానీ ఉపేంద్ర చేశారు’ అని ప్రశాంత్ నీల్ అన్నారు. ఉపేంద్ర స్టోరీ టెల్లింగ్ రెవల్యూషనల్గా ఉంటుందని తెలిపారు.
తనకు ఆల్ టైమ్ ఫేవరెట్ యాక్టర్ అమితాబ్ బచ్చన్, శ్రీదేవి ఇష్టమైన హీరోయిన్ అని చెప్పారు. ప్రశాంత్ నీల్ నెక్ట్స్ జూనియర్ ఎన్టీఆర్తో ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేయనున్నారు. ఆ తర్వాత ప్రభాస్తో సలార్ సీక్వెల్స్ ‘శౌర్యంగపర్వం’ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో కూడా ఓ సినిమా చెయ్యనున్నట్లు తెలుస్తుంది.