HanuMan: తేజ సజ్జా హీరోగా- ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో వచ్చిన ‘హనుమాన్’ మూవీ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా.. పలు పెద్ద సినిమాలతో పోటీని తట్టుకుని రూ. 300 కోట్ల కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
40 కోట్లతో హనుమాన్ మూవీ తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ.. ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో వచ్చిన మొదటి సూపర్ హీరో సినిమాగా రికార్డ్ క్రియేట్ చేయడమే కాకుండా హనుమాన్ కథకు ఇండియన్ మైథాలజీని లింక్ చేసి ప్రేక్షకులను మెప్పించాడు.
ఈ మూవీ విజువల్స్ చూసిన చిన్న పిల్లలు మరియు పెద్దలు ఫిదా అయ్యారు. థియేటర్స్‌లో రికార్డ్స్ క్రియేట్ చేసిన హనుమాన్.. ఓటీటీలో కూడా సత్త చాటుంది. తాజాగా హనుమాన్ మూవీకి అవార్డుల వర్షం మొదలైంది. ఈ క్రమంలో రేడియో సిటీ తెలుగు నిర్వహించింది.
ఈ ఐకాన్ అవార్డ్స్‌లో హనుమాన్ సినిమాకు గాను బెస్ట్ డైరెక్టర్ అవార్డును ప్రశాంత్ వర్మ అందుకున్నాడు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. ఇది ఆరంభం మాత్రమే అంటూ ఆయనకు ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.