HomeTelugu Trendingప్రశాంత్‌ వర్మ-తేజ సజ్జ 'హనుమాన్‌' షూటింగ్ ప్రారంభం

ప్రశాంత్‌ వర్మ-తేజ సజ్జ ‘హనుమాన్‌’ షూటింగ్ ప్రారంభం

Prasanth varma Hanuman mo

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ వెళుతున్నాడు. చిన్న సినిమాలనే కాదు … భారీ బడ్జెట్ చిత్రాలను కూడా తెరకెక్కించగలనని నిరూపించుకున్నాడు. ఇటీవలే ఆయన ‘ హనుమాన్’ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి మిగతా వివరాలు వెల్లడించలేదు. అయితే ఈ సినిమాలో తేజ సజ్జ హీరోగా నటించనున్నట్టు వార్తలు వినిపించాయి. ఈ రోజు ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది.

ఈసినిమాలో హీరో తేజ సజ్జపై నిర్మాత సి.కల్యాణ్ క్లాప్ ఇవ్వగా.. జెమినీ కిరణ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి శివశక్తిదత్త దర్శకత్వం వహించారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు ప్రారంభం కానుంది. ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కాంబినేషన్లో వచ్చిన ‘జాంబి రెడ్డి’ విజయాన్ని సాధించింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ద్వారా కొత్త హీరోయిన్‌ను పరిచయం చేయనున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu