Prasanna Vadanam: టాలీవుడ్ నటుడు సుహాస్ హీరోగా దూసుకుపోతున్నాడు. కలర్ ఫొటో సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజి బ్యాండు.. లాంటి కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో వరుస హిట్స్ కొడుతున్నాడు. షార్ట్ ఫిలిమ్స్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎదిగి ఇప్పుడు హీరోగా వరుస సినిమాలు చేస్తూ సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు.
ఇటీవల అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ తో హిట్ కొట్టిన సుహాస్ ఇప్పుడు మరో కొత్త కాన్సెప్ట్ ‘ప్రసన్న వదనం’ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు అర్జున్ వైకే దర్శకత్వం వహిస్తుండగా.. పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లిటిల్ థాట్స్ సినిమాస్, అర్హ మీడియా బ్యానర్‌పై మణికంఠ JS, ప్రసాద్ రెడ్డి TR సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్ ఆకట్టుకుంది.తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ విడుదలైంది. టీజర్ చూస్తుంటే సినిమా క్రైం థ్రిల్లర్ అని తెలుస్తోంది . ఈ సినిమాలో సుహాస్.. ఫేస్ బ్లైండ్‌నెస్ అనే వ్యాధితో అరుదైన వ్యాధితో బాధపడుతుంటాడు.
ఈ వ్యాధి వచ్చిన వారు ఒక వ్యక్తికి సంబంధించి మొహం తప్ప అన్ని గుర్తుపడతారు. అయితే ఈ వ్యాధి ఉన్న సుహాస్‌కు అనుకోకుండా ఒక సమస్య ఎదురవుతుంది. ఇక ఆ సమస్య నుంచి సుహాస్ ఎలా బయటపడ్డాడు అనేది సినిమా స్టోరీ. ఆసక్తికంగా సాగిన ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.