Prasanna Vadanam OTT: సుహాస్ హీరోగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజా సస్పెన్స్ థ్రిల్లర్ ‘ప్రసన్న వదనం’. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుహాస్. ఈ సినిమాకి స్టార్ డైరెక్టర్ సుకుమార్ అసోసియేట్.. అర్జున్ వై కె దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను జెఎస్ మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మించారు.
పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మే 3న ఎంతో గ్రాండ్‌గా విడుదలైన ప్రసన్నవదనం సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఈ సినిమాలో ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగున్నాయని ఆడియెన్స్ కూడా ఒప్పుకున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయింది అనే టాక్ బయ్యకు వచ్చింది.
మొట్ట మొదటి సారిగా ఫేస్ బ్లైండ్‌నెస్ అనే కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ సైతం వచ్చాయి. వారం రోజుల్లోనే రూ.5 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. అలాగే బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకుని ప్రాఫిట్ కూడా తీసుకొచ్చింది అని నిర్మాతలు ప్రకటించారు. ఇక ఈ వెరైటీ కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమా ప్రమోషన్స్ జోరుగా చేశారు. మొదటి నుంచి సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయింది.
తాజాగా ప్రసన్నవదనం సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ ఆహా కొనుగోలు చేసినట్లు మూవీ టైటిల్ కార్డ్స్‌లో చూపించడంతో కన్ఫర్మ్ చేశారు. అయితే ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది అనేది కన్ఫర్మ్ కాలేదు. ప్రసన్నవదనం సినిమాను మొదట థియేట్రికల్ రిలీజ్ తర్వాత 30 రోజులకు ఓటీటీలో విడుదల చేస్తారని టాక్. ఇప్పుడు దానికంటే ముందుగా నెల తిరగకుండానే ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ సినిమా 24 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్నట్టు అధికారిక ప్రకటన వచ్చేసింది.