HomeTelugu ReviewsPrasanna Vadanam Review: కొత్త కాన్సెప్ట్‌తో సుహాస్‌ ప్రయోగం..ఫలించిందా?

Prasanna Vadanam Review: కొత్త కాన్సెప్ట్‌తో సుహాస్‌ ప్రయోగం..ఫలించిందా?

 Prasanna Vadanam reviewPrasanna Vadanam review: హీరో సుహాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ.. ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇటీవలే ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్’​తో హిట్ అందుకున్న ఆయన తాజాగా ప్ర‌స‌న్న వ‌ద‌నంతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు.

రేడియో జాకీగా పనిచేసే సూర్య (సుహాస్‌)కు ఒక ప్ర‌మాదం కారణంగా..తన అమ్మానాన్న‌ల్ని కోల్పోతాడు. ఫేస్ బ్లైండ్ నెస్ అనే స‌మ‌స్యకు కూడా గురౌతాడు. ఎవ‌రి మొహాల్నీ, గొంతుల్ని గుర్తు ప‌ట్ట‌లేడు. ఈ సమస్య గురించి త‌న స్నేహితుడు విఘ్నేష్ (వైవా హ‌ర్ష‌)కు త‌ప్ప ఎవరికీ తెలీకుండా జాగ్ర‌త్తలు తీసుకుంటుంటాడు. ఈ క్రమంలోనే ఆద్య (పాయల్‌)తో ప్రేమలో పడిన అతడు అనుకోకుండా త‌న క‌ళ్లతో ఓ హత్య చూస్తాడు.

కానీ త‌న‌కున్న స‌మ‌స్య‌ వల్ల ఆ హ‌త్యకులను గుర్తుపట్టలేడు. కానీ, పోలీసుల‌కు ఈ విష‌యం చెప్పాలని ప్రయత్నించిన అతడిపై దాడి జ‌రుగుతుంది. అయినప్పటికీ వెన‌క‌డుగు వేయ‌కుండా సూర్య ముందుకెళ్తాడు. అనూహ్యంగా ఆ హ‌త్య కేసులో తానే ఇరుక్కుని మరిన్ని కష్టాల్ని ఎదుర్కొంటాడు.

సుహాస్‌ ఈ సినిమాలో కొత్త‌గా కనిపించాడు. ఫేస్ బ్లైండ్‌నెస్ కాన్సెప్ట్ కొత్తగా ఉంది. సినిమా ఆద్యంతం మంచి మ‌లుపులు తిరుగుతూ ప్రేక్ష‌కుల‌కు మంచి థ్రిల్‌ను పంచుతుంది. ఓ రకంగా ద‌ర్శకుడు విజ‌యం సాధించాడనే చెప్పాలి. హీరోకు అత‌డి స్నేహితుడికీ మ‌ధ్య సీన్స్​, ఆద్య‌తో లవ్ ట్రాక్​ ఎపిసోడ్స్ బాగున్నాయి. హీరో హ‌త్యను చూడ‌టంతో క‌థ మలుపు తిరిగి ఆస‌క్తి మొద‌ల‌వుతుంది.ఇంటర్వెల్ ముందు మలుపు తిరిగిన ఈ కథ సినిమాను ఉత్కంఠ‌భ‌రితంగా మార్చేస్తుంది.

సెకంఢాప్​లో హీరో చుట్టూ ఉచ్చు బిగుసుకోవ‌డం, హీరో తనకున్న వ్యాధితోనే నేరస్థుడు ఎవ‌రనేది క‌నిపెట్టడానికి చేసే పోరాటం, ఈ క్రమంలోనే చోటు చేసుకునే మలుపులు ఆసక్తికరంగా సాగుతాయి. హత్యకు సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ చాలా కీలకం. క్లైమాక్స్​ సీన్స్​ సినిమాను మ‌రింత ఉత్కంఠగా చూపిస్తుంది. అక్క‌డ‌క్క‌డ మాత్రమే కాస్త స్లో అవుతుంది కానీ ఓ కొత్త ర‌క‌మైన థ్రిల్ల‌ర్‌ను చూసిన అనుభూతి మాత్రం ఉంటుందనే చెప్పాలి.

సుహాస్ న‌ట‌న ఎప్పటిలాగానే బాగుంది. అతడి పాత్ర కామెడీ, ఎమోషనల్​ బాగా పండింది. పోలీస్ అధికారిగా రాశిసింగ్‌ పాత్ర అల‌రించింది. నితిన్ ప్ర‌స‌న్న పాత్ర సినిమాకు ఎంతో కీల‌కం. వైవాహర్ష తెలిసిన స్నేహితుడి పాత్ర‌లో సంద‌డి చేశాడు. నందు, సాయి శ్వేత తమ పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించి ఆకట్టుకున్నారు. టెక్నికల్​గా బాగుంది. విజయ్ బుల్గానిన్ బ్యాక్​ గ్రౌండ్ స్కోర్​ ప్ర‌భావం చూపుతుంది. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ కూడా బాగుంది. ద‌ర్శ‌కుడు అర్జున్‌ తన తొలి చిత్రాన్నే ఎంతో స్ప‌ష్టంగా చూపించారు. తన ర‌చ‌న‌లో బిగి, బ‌లం దాగి ఉంది. నిర్మణ విలువలు సినిమాకి తగ్గటుగా ఉన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu