అందాల తారా స్నేహ రెండోసారి తల్లయ్యారు. ఈ రోజు (శుక్రవారం) ఆమె పాపకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె భర్త నటుడు ప్రసన్న ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఏంజెల్ వచ్చేసిందని అన్నాడు. దీంతో పలువురు సినీ ప్రముఖులు స్నేహ-ప్రసన్న దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తమిళ సినిమా అచ్చముండు అచ్చముండు షూటింగ్ సమయంలో నటుడు ప్రసన్నతో స్నేహ ప్రేమలో పడ్డారు.
2012 వీరిద్దరి విహహ బంధంతో ఒకటయ్యారు. వీరికి ఇప్పటికే విహాన్ అనే బాబు ఉన్న సంగతి తెలిసిందే. కాగా, బాబు పుట్టిన తర్వాత సినిమాల గ్యాప్ ఇచ్చిన స్నేహ.. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఇటీవల ధనుష్ హీరోగా తెరకెక్కిన తమిళ చిత్రం పటాస్‌లో ఆమె నటించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది.