కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో రోజు కూలీలు, పేదల పరిస్థితి దయనీయంగా మారింది. ఆహారం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో తనవంతు కృషి చేస్తున్నారు నటి ప్రణీత. అందంతోనే కాదు, మంచి మనసుతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ప్రణీత. తెలుగులో ‘బావ’, ‘అత్తారింటికిదారేది’ తదితర చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
తొలుత ఆర్థికంగా సహాయం చేసిన ఈ బాపుగారి బొమ్మ.. ఆ తర్వాత పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. తాజాగా భోజనం తయారు చేసి ప్యాకెట్లలో సర్ది పేదలకు పంపిణీ చేస్తున్నారు. తానే స్వయంగా రంగంలోకి దిగి వంట చేయడం, వండిన పదార్థాలను ప్యాక్ చేసి పేదలకు అందిస్తున్నారు. అలా ఇప్పటివరకూ 75వేల పార్శిళ్లు పంపిణీ చేశారట. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ప్రణీత మంచి మనసును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ప్రణీతలో అందంతో పాటు, అందమైన మనసు కూడా ఉందని మెచ్చుకుంటున్నారు.