ప్రేమ కథలపై మెగాహీరో దృష్టి!
రామ్ చరణ్ గతంలో ‘ఆరెంజ్’ అనే సినిమాలో నటించాడు. ఆ సినిమా నిరాశ పరచడంతో తరువాత
ప్రేమ కథల జోలికి వెళ్లలేదు. అన్ని మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకొని చేసిన చిత్రాలే. ఈ
నేపధ్యంలో మళ్ళీ ప్రేమ కథల చిత్రాల్లో నటించాలని రామ్ చరణ్ ఫిక్స్ అయ్యాడట. అటువంటి
ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ ను సిద్ధం చేయమని ఇద్దరు డైరెక్టర్స్ ను పుర్మాయించాడట. అందులో ఒకరు
మేర్లపాక గాంధీ. ‘ఎక్స్ ప్రెస్ రాజా’ సినిమా తరువాత ఆయన మరొక సినిమాను అనౌన్స్ చేయలేదు.
ఈ నేపధ్యంలో చరణ్ తో సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాంధీ చెప్పిన లైన్ చెర్రీకు
బాగా నచ్చడంతో పూర్తి కథను సిద్ధం చేయమన్నాడట. ప్రేమలో కొత్త కోణాన్ని ఆవిష్కరించే
విధంగా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన
విషయాలు తెలియనున్నాయి. చరణ్ ప్రస్తుతం దృవ సినిమాలో నటిస్తున్నాడు. దీని తరువాత
సుకుమార్ సినిమా ఉంది. ఆ తరువాతే మేర్లపాక గాంధీ దర్శకత్వంలో సినిమా ఉంటుంది.