HomeTelugu Big Storiesఒక్కరోజులో తీసుకున్న నిర్ణయం కాదు: ప్రకాశ్‌ రాజ్‌

ఒక్కరోజులో తీసుకున్న నిర్ణయం కాదు: ప్రకాశ్‌ రాజ్‌

Prakash raj press meeting
టాలీవుడ్ లో ‘మా’ ఎన్నికలు వేడి పుట్టిస్తున్నాయి. ప్రకాశ్ రాజ్, జీవిత, మంచు విష్ణు, హేమ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. ఈ సందర్భంగా నిన్న గురువారం సాయంత్రం తన 27 మందితో తన ప్యానల్‌ని ప్రకటించారు. ఇందులో భాగంగానే శుక్రవారం ఉదయం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ.. ‘మా’ ఎన్నికల్లో రాజకీయ నాయకులు కూడా భాగమవుతున్నారంటూ కొన్నిచోట్ల వార్తలు వచ్చాయి. ‘మా’లో పోటీ చేయాలనేది ఒక్కరోజులో తీసుకున్న నిర్ణయం కాదు. రెండేళ్ల నుంచే ఆలోచిస్తున్నాను. గడిచిన ఏడాది కాలం నుంచి ప్యానల్‌లో ఎవర్నీ తీసుకోవాలి? చిత్రపరిశ్రమలో ఉన్న సమస్యలు పరిష్కరించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను’’ అని ప్రకాశ్‌రాజ్‌ తెలిపారు.

నా ప్యానల్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రశ్నించేవాళ్లే. ఆఖరికి తప్పు చేస్తే నన్ను కూడా వాళ్లు ప్రశ్నిస్తారు. ఆ అర్హత వాళ్లకు ఉంది. మోహన్‌బాబు, చిరంజీవి, నాగార్జున.. ఇలా ప్రతిఒక్కరిదీ ఒక్కటే తపన.. అసోసియేషన్‌ని అభివృద్ధి చేయడమే. ఈ మధ్యకాలంలో నేను ఎక్కువగా లోకల్‌, నాన్‌లోకల్‌ అని వింటున్నాను. కళాకారులు లోకల్‌ కాదు యూనివర్సల్‌. కళాకారులు వెలుగులాంటి వాళ్లు. భాషతో వాళ్లకు సంబంధం ఉండదు. గతేడాది ఎన్నికల్లో నాన్‌లోకల్‌ అనే అంశం రాలేదు. నా అసిస్టెంట్స్‌కి ఇళ్లు కొని ఇచ్చినప్పుడు నాన్‌లోకల్‌ అనలేదు. రెండు గ్రామాలు దత్తత తీసుకున్నప్పుడు నాన్‌ లోకల్‌ అనలేదు. తొమ్మిది నందులు తీసుకున్నప్పుడు, జాతీయ అవార్డు పొందినప్పుడు నాన్‌లోకల్‌ అనలేదు. అలాంటిది ఇప్పుడు ఎలా నాన్‌లోకల్‌ అంటున్నారు.

‘మా’ ఎంతో బలమైన అసోసియేషన్‌. ప్యానల్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ కష్టాలు ఎదుర్కొన్నవాళ్లే. ఇండస్ట్రీలో అనుభవం ఉన్నవాళ్లే. ఇది ఎంతో క్లిష్ట సమయం. మన గృహాన్ని ఇకపై మరింత పరిశుభ్రం చేసుకోవాలి. అర్హత చూసి ఓటు వేయండి. ప్రణాళికలు సిద్ధం చేశాం. ప్రతిదానికి లెక్కలు చూపిస్తాం. మీరందరూ ఆశ్చర్యపడేలా మేము పనిచేస్తాం. ఈ మేరకు ప్రతిరోజూ అందరి పెద్దలతో మేము మాట్లాడుతున్నాం. ఎలక్షన్‌ డేట్‌ ప్రకటించే వరకూ మా ప్యానల్‌లోని ఎవరూ కూడా మీడియా ముందుకు రారు’ అని ప్రకాశ్‌రాజ్‌ వివరించారు.

ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ సభ్యులు వీరే

Recent Articles English

Gallery

Recent Articles Telugu