ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘రంగమార్తాండ’. రాజశ్యామల ఎంటర్టయిన్మెంట్స్ బ్యానర్ వారు నిర్మించిన ఈ సినిమాకి, ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఒక రంగస్థల నటుడి జీవితం చుట్టూ అల్లుకున్న కథ ఇది. ఈ సినిమాలో బ్రహ్మానందం, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. భావోద్వేగాలతో ఈ కథ కదులుతూ ఉంటుంది.
ఈ సినిమాలో రాఘవరావు అనే పాత్రలో ప్రకాశ్ రాజ్ నటిస్తున్నారు. ఆ పాత్రకి సంబంధించిన పోస్టర్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. కథలో భాగంగా తనకి జరిగిన సన్మానం పట్ల ప్రకాశ్ రాజ్ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా ఈ పోస్టర్ ఉంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.