‘మా’ అధ్యక్ష పదవికి ప్రకాశ్‌రాజ్ నామినేషన్ దాఖలు చేశారు. తన ప్యానల్ సభ్యులతో కలిసి ఈ ఉదయం నామినేషన్ వేశారు. అక్టోబర్ 10న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ వేసిన అనంతరం ప్రకాశ్‌రాజ్ మాట్లాడుతూ..‘ప్రతి విషయంలో మేం ఒక అడుగు ముందే ఉన్నాం. ఇవి ఎన్నికలు కాదు.. పోటీ మాత్రమే. గెలిపించేది.. ఓడించేది ఓటర్లే. అక్టోబర్ 3న మా ఎన్నికల ప్రణాళిక వెల్లడిస్తా. ‘మా’ ఎన్నికల్లో రాజకీయ జోక్యం వద్దు’ అని అన్నారు. మరోవైపు ‘మా’ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రకాశ్ రాజ్, విష్ణు ప్యానళ్ల సభ్యులు ఒకరిపై మరొకరు విమర్శలు, ప్రతి విమర్శలతో ప్రచారం వాడీవేడీగా సాగుతోంది.