మెగాస్టార్ చిరంజీవి పెద్దకూతురు సుస్మిత కొణిదెల ఇప్పుడు నిర్మాణ రంగంలోకి ఎంటరైన సంగతి తెలిసిందే. ఇప్పటికే చిరంజీవి సినిమాల్లో కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేసి తన ప్రతిభను నిరూపించుకుంది. తాజాగా ‘గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్మెంట్’ పేరిట ఓ చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పింది. ముందుగా వెబ్ సీరీస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఓటీటీ వేదికలు బాగా పాపులర్ కావడంతో పలు వెబ్ సీరీస్ లను నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ఓయ్ సినిమాకు దర్శకత్వం వహించిన ఆనంద్ రంగా ఈ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేయబోతున్నాడు. ఎక్స్ ఛేంజ్ ఆఫ్ ఫైర్ టైటిల్ తో రానున్న వెబ్ సిరీస్ లో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. మరో నటుడు సంపత్ రాజ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు రావాల్సి ఉంది.